Not seeing a Scroll to Top Button? Go to our FAQ page for more info.

Thursday, April 25, 2013

1 యోహాను 1వ అధ్యాయము

1. జీవవాక్యమును గూర్చినది, ఆదినుండి ఏది యుండెనో, మేమేది వింటిమో, కన్నులార ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో, అది మీకు తెలియజేయుచున్నాము. 
2. ఆ జీవము ప్రత్యక్షమాయెను; తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్యజీవమును మేము చూచి, ఆ జీవమునుగూర్చి సాక్ష్యమిచ్చుచు, దానిని మీకు తెలియపరచుచున్నాము. 
3. మాతో కూడ  మీకును సహవాసము కలుగునట్లు మేము చూచినదానిని వినినదానిని మీకును తెలియజేయుచున్నాము. మన సహవాసమైతే తండ్రితోకూడను ఆయన కుమారుడైన యేసు క్రీస్తుతో కూడను ఉన్నది. 
4. మన సంతోషము పరిపూర్ణమవుటకై మేమీ సంగతులను వ్రాయుచున్నాము. 
5. మేమాయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా --దేవుడు వెలుగై యున్నాడు; ఆయన యందు చీకటి ఎంతమాత్రమును లేదు. 
6. ఆయనతో కూడ సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచినయెడల మనమబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. 
7. అయితే ఆయన వేలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన యెడల, మనము అన్యోన్యసహవాసము గలవారమైయుందుము; అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. 
8. మనము పాపము లేనివారమని చెప్పుకొనినయెడల, మనలను మనమే మోసపుచ్చుకొందుము; మరియు మనలో సత్యముండదు. 
9. మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల, ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. 
10. మనము పాపము చేయలేదని చెప్పుకొనిన యెడల, ఆయనను అబద్ధికునిగా చేయువారమగుదుము; మరియు ఆయన వాక్యము మనలో ఉండదు.
      Download Audio File

1 యోహాను 2వ అధ్యాయము

1. నా చిన్నపిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై ఈ  సంగతులను మీకు  వ్రాయుచున్నాను. ఎవడైనను పాపము చేసిన యెడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు.
2. ఆయనే మన పాపములకు శాంతికరమై యున్నాడు; మన పాపములకు మాత్రమే కాదు, సర్వ లోకమునకును  శాంతికరమై యున్నాడు.
3. మరియు మనమాయన ఆజ్ఞలను గైకొనిన యెడల, దీని వలననే ఆయనను ఎరిగియున్నామని తెలికొందుము.
4. ఆయనను ఎరిగియున్నానని చెప్పుకొనుచు,  ఆయన ఆజ్ఞలను గైకొననివాడు అబద్ధికుడు; వానిలో సత్యము లేదు.
5. ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయెను;
6. ఆయనయందు నిలిచియున్నవాడనని చెప్పుకొనువాడు ఆయన ఏలాగు  నడుచుకొనెనో ఆలాగే తానును నడుచుకొన బద్ధుడైయున్నాడు. మనమాయనయందున్నామని దీనివలన తెలిసికొనుచున్నాము.
7. ప్రియులారా, మొదట నుండి మీకున్న పూర్వపు ఆజ్ఞనేగాని క్రొత్త ఆజ్ఞను నేను మీకు వ్రాయుటలేదు; ఈ పూర్వపు ఆజ్ఞ మీరు వినిన వాక్యమే.
8. మరియు క్రొత్త ఆజ్ఞను మీకు వ్రాయుచున్నాను. చీకటి గతించుచున్నది, సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుచున్నది గనుక అది ఆయనయందును మీయందును సత్యమే.
9. వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు, తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకును చీకటిలోనే యున్నాడు.
10. తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్న వాడు; అతని యందు అభ్యంతర కారణమేదియు లేదు.
11. తన సహోదరు ద్వేషించువాడు  చీకటిలో ఉండి, చీకటిలో నడుచుచున్నాడు; చీకటి అతని కన్నులకు గ్రుడ్డితనము కలుగజేసెను గనుక తానెక్కడికి పోవుచున్నాడో అతనికి తెలియదు.
12. చిన్నపిల్లలారా, ఆయన నామమును బట్టి మీ పాపములు క్షమించబడినవి గనుక మీకు వ్రాయుచున్నాను.
13. తండ్రులారా, మీరు ఆది నుండి యున్నవానిని ఎరిగి యున్నారు గనుక మీకు వ్రాయుచున్నాను. యౌవనస్థులారా, మీరు దుష్టుని జయించియున్నారు గనుక మీకు వ్రాయుచున్నాను.
14. చిన్నపిల్లలారా, మీరు తండ్రిని ఎరిగియున్నారు గనుక మీకు వ్రాయుచున్నాను తండ్రులారా, మీరు ఆదినుండి యున్నవానిని ఎరిగి యున్నారు గనుక మీకు వ్రాయుచున్నాను.యౌవనస్థులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలుచుచున్నది; మీరు దుష్టుని జయించియున్నారు గనుక మీకు వ్రాయుచున్నాను.
15. ఈ లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలోనుండదు.
16. లోకములో ఉన్నదంతయ, అనగా శరీరాశయు నేత్రాశయు జీవపుడంబమును తండ్రి వలన పుట్టినవి కావు; అవి లోకసంబంధమైనవే.
17. లోకమును దాని ఆశయు గతించిపోవుచున్నవి గాని, దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును.
18.  చిన్నపిల్లలారా, యిది కడవరి గడియ. క్రీస్తువిరోధి వచ్చునని వింటిరి గదా ఇప్పుడును అనేకులైన క్రీస్తువిరోధులు బయలుదేరియున్నారు; ఇది కడవరి గడియ అని దీనిచేత తెలిసికొనుచున్నాము.
19. వారు మనలోనుండి  బయలువెళ్లిరి గాని వారు మన సంబంధులు కారు; వారు మన సంబందులైతే మనతో కూడ నిలిచియుందురు; అయితే వారందరు మన సంబంధులు కారని ప్రత్యక్షపరచబడునట్లు వారు బయలువెళ్ళిరి.
20. అయితే మీరు పరిశుద్ధుని వలన అభిషేకము పొందిన వారు గనుక సమస్తమును ఎరుగుదురు.
21. మీరు సత్యమెరుగనివారైనందున  నేను వ్రాయలేదు గాని, మీరు దానిని ఎరిగియున్నందునను, ఏ అబద్ధమును సత్యసంబంధమైనది కాదని ఎరిగియున్నందునను మీకు వ్రాయుచున్నాను.
22. యేసు, క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడబద్ధికుడు? తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి.
23. కుమారుని ఒప్పుకొనని  ప్రతివాడును తండ్రిని అంగీకరించువాడు కాడు; కుమారుని ఒప్పుకొనువాడు తండ్రిని అంగీకరించువాడు .
24. అయితే మీరు మొదట నుండి దేనిని వింటిరో అది మీలో నిలువనియ్యుడి; మీరు మొదట నుండి వినినది మీలో నిలిచినయెడల, మీరుకూడ కుమారునియందును తండ్రియందును నిలుతురు. 
25. నిత్యజీవము అనుగ్రహింతుననునదియే ఆయన తానె మనకు చేసిన వాగ్దానము. 
26. మిమ్మును మోసపరచువారిని బట్టి యీ సంగతులు మీకు వ్రాసియున్నాను. 
27. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది గనుక ఎవడును మీకు బోధింపనక్కరలేదు; ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే గాని అబద్ధము కాదు; అది అన్నిటిని గూర్చి మీకు బోధించుచున్నప్రకారముగాను, ఆయన మీకు బోధించిన ప్రకారముగాను, ఆయనలో మీరు నిలుచుచున్నారు. 
28. కాబట్టి చిన్నపిల్లలారా, ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడ యందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగియుండునట్లు మీరాయన యందు నిలిచియుండుడి. 
29. ఆయన నీతిమంతుడని మీరెరిగియున్న యెడల నీతిని జరిగించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టియున్నాడని యెరుగుదురు.
    Download Audio File

Wednesday, April 24, 2013

1 యోహాను 3వ అధ్యాయము

1. మనము దేవుని పిల్లలమని పిలువబడునట్లు తండ్రి మనకెట్టి ప్రేమననుగ్రహించెనో  చూడుడి; మనము దేవుని పిల్లలమే. ఈ హేతువు చేత లోకము మనలను ఎరుగదు, ఏలయనగా అది ఆయనను ఎరుగలేదు.
2. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై యున్నాము మనమిక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు గాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన యున్నట్లుగానే ఆయనను చూతము గనుక ఆయనను పోలియుందుమని యెరుగుదుము.
3. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతివాడును ఆయన పవిత్రుడై యున్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసికొనును.
4. పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును; ఆగ్నాతిక్రమమే పాపము.
5. పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయెనని మీకు తెలియును ; ఆయన యందు పాపమేమియు లేదు .
6. ఆయన యందు నిలిచియుండువాడెవడును  పాపము చేయడు; పాపము చేయువాడెవడును ఆయనను చూడనులేదు ఎరుగనులేదు.
7. చిన్నపిల్లలారా, యెవనిని మిమ్మును మోసపరచనీయకుడి. ఆయన నీతిమంతుడైయున్నట్టు నీతిని జరిగించు ప్రతివాడును నీతిమంతుడు.
8. అపవాది మొదట నుండి పాపము చేయుచున్నాడు గనుక  పాపము చేయువాడు అపవాది  సంబంధి; అపవాది  యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను.
9. దేవుని మూలముగా పుట్టిన ప్రతివానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయడు; వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము  చేయజాలడు.
10. దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది  పిల్లలెవరో తేటపడును. నీతిని జరిగించని ప్రతివాడును, తన సహోదరుని ప్రెమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కారు .
11. మనమొకని నొకడు ప్రేమింపవలెననునది మొదటనుండి  మీరు వినిన వర్తమానమేగదా.
12. మనము కయీను వంటివారమై యుండరాదు. వాడు దుష్టుని సంబందధియై తన సహోదరుని చంపెను ; వాడతనిని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు నీతి గలవియునై యుండెను గనుకనే గదా?
13. సహోదరులారా, లోకము మిమ్మును ద్వేషించిన యెడల ఆశ్చర్యపడకుడి.
14. మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటియున్నామని యెరుగుదుము. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచియున్నాడు.
15. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు; ఏ  నరహంతకునియందును నిత్యజీవముండదనిమీరెరుగుదురు.
16. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీనివలన ప్రేమ యెట్టిదని తెలిసికొనుచున్నాము. మనముకూడ సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్ట బద్ధులమై యున్నాము. 
17. ఈ లోకపు జీవనోపాధిగలవాడైయుండి తన సహోదరునికి లేమి కలుగుట చూచియు, అతని యెడల ఎంతమాత్రమును కనికరము చూపనివానియందు దేవుని ప్రేమ యేలాగు నిలుచును?
18. చిన్నపిల్లలారా, మాటతోను నాలుకతోను కాక క్రియతోను సత్యముతోనుప్రేమింతము. 
19. ఇందువలన మనము సత్యసంబంధులమని యెరుగుదుము. 
20. దేవుడు మన హృదయము కంటే అధికుడై, సమస్తమును ఎరిగియున్నాడు గనుక మన హృదయము ఏ యే విషయములలో  మనయందు దోషారోపణ చేయునో ఆ యా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరచుకొందము. 
21. ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయని యెడల దేవుని ఎదుట ధైర్యము గలవారమగుదుము. 
22. మరియు మనమాయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక, మనమేమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. 
23. ఆయన ఆజ్ఞ యేదనగా-ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని, ఆయన మనకు ఆగ్ననిచ్చిన ప్రకారముగా ఒకనినొకడు ప్రేమింపవలెననునదియే. 
24. ఆయన ఆజ్ఞలను గైకొనువాడు ఆయన యందు నిలిచియుండును, ఆయన వాని యందు నిలిచియుండును; ఆయన మనయందు నిలిచియున్నాడని ఆయన మనకనుగ్రహించిన ఆత్మమూలముగా తెలిసికొనుచున్నాము. 
     Download Audio File

Tuesday, April 23, 2013

1 యోహాను 4వ అధ్యాయము

1.  ప్రియులారా, అనేకులైన అబద్ధ  ప్రవక్తలు లోకములోనికి బయలువెళ్లియున్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక,
ఆ యా ఆత్మలు దేవుని సంబంధమైనవో  కావో పరీక్షించుడి.
2. యేసుక్రీస్తు శరీరధారియై వచ్చెనని, యే ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని  సంబంధమైనది;
3. యే  ఆత్మ యేసుని ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు ; దీనిని బట్టియే దేవుని ఆత్మను మీరెరుగుదురు. క్రీస్తువిరోధి ఆత్మ వచ్చునని మీరు వినిన సంగతి ఇదే; యిదివరకే అది లోకములో ఉన్నది.
4.  చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు; మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారని జయించి యున్నారు .
5.  వారు లోకసంబంధులు గనుక లోకసంబంధులైనట్టు మాటలాడుదురు, లోకము వారి మాట వినును.
6.  మనము దేవుని సంబంధులము ; దేవుని ఎరిగినవాడు మన మాట వినును, దేవుని సంబంధి  కానివాడు మన మాట వినడు. ఇందువలన మనము సత్యస్వరూపమైన ఆత్మ ఏదో  తెలిసికొనుచున్నాము.
7. ప్రియులారా, మనము ఒకనినొకడు ప్రేమింతము ; ఏలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది ; ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగును.
8.  దేవుడు ప్రేమాస్వరూపి; ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు.
9.  మనము ఆయన ద్వారా జీవించునట్లు, దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను ; దీనివలన దేవుడు మనయందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను.
10.  మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి, మన పాపములకు ప్రాయశ్చిత్తమై యుండుటకు తన కుమారుని పంపెను ;ఇందులో ప్రేమయున్నది
11. ప్రియులారా, దేవుడు మనలను ఈలాగు ప్రేమింపగా మనమొకనినొకడు ప్రేమింప బద్ధులమై యున్నాము.
12. ఏ మానవుడు దేవుని ఎప్పుడును  చూచియుండలేదు  మనమొకనినొకడు ప్రేమించిన యెడల దేవుడు  మనయందు నిలిచియుండును; ఆయన ప్రేమ మన యందు సంపూర్ణమగును.
13. దీని వలన మనము ఆయనయందు నిలిచియున్నామనియు ఆయన మన యందున్నాడనియు తెలిసికొనుచున్నాము; ఏలయనగా ఆయన మనకు మన ఆత్మలో పాలు దయచేసియున్నాడు.
14.  మరియు తండ్రి తన కుమారుని లోకరక్షకుడుగా ఉండుటకు పంపియుండుట మేము చూచి, సాక్ష్యమిచ్చుచున్నాము.
15.  యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో, వానిలో దేవుడు నిలిచియున్నాడు, వాడు దేవునియందున్నాడు.
16.  మనయెడల దేవునికి ఉన్న ప్రేమను మనమెరిగినవారమై దాని నమ్ముకొనియున్నాము;  దేవుడు ప్రేమాస్వరూపియైయున్నాడు, ప్రేమయందు నిలిచియుండువాడు దేవుని యందు నిలిచియున్నాడు, దేవుడు వానియందు నిలిచియున్నాడు.
17.  తీర్పుదినమందు మనకు ధైర్యము కలుగునట్లు దీనివలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి యున్నది ; ఏలయనగా ఆయన ఎట్టివాడైయున్నాడో మనముకూడ ఈ లోకములో అట్టి వారమైయున్నాము.
18.  ప్రేమలో భయముండదు; అంతే కాదు; పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును; భయము దందనతో కూడినది; భయపడువాడు ప్రేమయందు పరిపూర్ణము చేయబడినవాడు కాడు.
19.  ఆయెనే మొదట  మనలను ప్రేమించెను గనుక మనము ప్రేమించుచున్నాము.
20.  ఎవడైనను -నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి, తన సహోదరుని ద్వేషించిన యెడల అతడు అబద్ధికుడగును; తాను  చూచిన  తన సహోదరుని ప్రేమింపని వాడు తాను  చూడని దేవుని ప్రేమింపలేడు
21. దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడ ప్రేమింపవలెనను ఆజ్ఞను మనమాయనవలన పొందియున్నాము.
       Download Audio File

1 యోహాను 5వ అధ్యాయము

1. యేసే క్రీస్తయి యున్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలముగా పుట్టియున్నాడు . పుట్టించినవానిని ప్రేమించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టినవానిని ప్రెమించును. 
2. మనము దేవుని  ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చువారమైతిమా దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దానివలననే యెరుగుదుము. 
3. మనమాయన ఆజ్ఞలను గైకొనుటయే  దేవుని ప్రేమించుట ; ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు . 
4. దేవుని మూలముగా పుట్టినవారందరును లోకమును జయించుదురు ; లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. 
5. యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు?
6. నీళ్ళ ద్వారాను రక్తము ద్వారాను వచ్చినవాడు ఈయనే, అనగా యేసుక్రీస్తే. ఈయన నీళ్ళతో మాత్రమేగాక  నీళ్ళతోను రక్తముతోను వచ్చెను. ఆత్మ సత్యము గనుక సాక్ష్యమిచ్చువాడు ఆత్మయే. 
7.  సాక్ష్యమిచ్చువారు ముగ్గురు, అనగా ఆత్మయు,నీళ్ళును, రక్తమును,
8. ఈ ముగ్గురు ఎకీభవించి యున్నారు. 
9. మనము మనుష్యుల సాక్ష్యము అంగీకరించుచున్నాము గదా! దేవుని  సాక్ష్యము మరి బలమైనది. దేవుని  సాక్ష్యము ఆయన తన కుమారుని గూర్చి యిచ్చినదే. 
10. దేవుని కుమారుని యందు విశ్వాసముంచువాడు  తనలోనే ఈ సాక్ష్యము కలిగియున్నాడు; దేవుని నమ్మనివాడు ఆయన తన కుమారుని గూర్చి యిచ్చిన సాక్ష్యమును నమ్మలేదు గనుక అతడు దేవుని అబద్ధికునిగా చెసినవాడే.  
11. ఆ సాక్ష్యమేమనగా --దేవుడు మనకు  నిత్యజీవమును దయచేసెను; ఈ జీవము ఆయన కుమారుని యందున్నది . 
12. దేవుని కుమారుని అంగీకరించువాడు జీవముగలవాడు; దేవుని కుమారుని అంగీకరింపనివాడు జీవములేనివాడే. 
13. దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్యజీవముగలవారని తెలిసికొనునట్లు నేను ఈ సంగతులను మీకు వ్రాయుచున్నాను. 
14. ఆయననుబట్టి మనకు కలిగిన ధైర్యమేదనగా ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను  ఆయన మన మనవి ఆలకించుననునదియే. 
15. మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనమెరిగిన యెడల మనమాయనాను వేడుకొనినవి మనకు కలిగినవని యెరుగుదుము. 
16. తన సహోదరుడు మరణకరము కాని పాపము చేయగా ఎవడైనను చూచినయెడల అతడు వేడుకొనును; అతనిబట్టి  దేవుడు మరణకరముకాని పాపము చేసిన వారికి జీవము దయచేయును. మరణకరమైన పాపము కలదు. అట్టిదానిగూర్చి వేడుకొనవలెనని నేను చెప్పుట లేదు. 
17.  సకల దుర్ణీతియు పాపము; అయితే మరణకరముకాని పాపము కలదు. 
18.  దేవుని మూలముగా పుట్టియున్న వాడెవడును పాపము చేయడని యెరుగుదుము. దేవుని మూలముగా పుట్టిన వాడు తన్ను భద్రము చేసికొనును గనుక దుష్టుడు వాని ముట్టడు. 
19.  మనము దేవుని సంబంధులమనియు, లోకమంతయు దుష్టుని యందున్నదనియు ఎరుగుదుము. 
20.  మనము సత్యవంతుడైన వానిని ఎరుగవలెనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకమనుగ్రహించియున్నాడని యెరుగుదుము. మనము దేవుని కుమారుడైన క్రీస్తుయేసునందున్నవారమై  సత్యవంతుని యందున్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్యజీవమునై యున్నాడు. 
21.  చిన్న పిల్లలారా, విగ్రహముల జోలికి పోకుండ జాగ్రత్తగా వుండుడి. 
Download Audio File