Not seeing a Scroll to Top Button? Go to our FAQ page for more info.

Wednesday, April 24, 2013

1 యోహాను 3వ అధ్యాయము

1. మనము దేవుని పిల్లలమని పిలువబడునట్లు తండ్రి మనకెట్టి ప్రేమననుగ్రహించెనో  చూడుడి; మనము దేవుని పిల్లలమే. ఈ హేతువు చేత లోకము మనలను ఎరుగదు, ఏలయనగా అది ఆయనను ఎరుగలేదు.
2. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై యున్నాము మనమిక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు గాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన యున్నట్లుగానే ఆయనను చూతము గనుక ఆయనను పోలియుందుమని యెరుగుదుము.
3. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతివాడును ఆయన పవిత్రుడై యున్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసికొనును.
4. పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును; ఆగ్నాతిక్రమమే పాపము.
5. పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయెనని మీకు తెలియును ; ఆయన యందు పాపమేమియు లేదు .
6. ఆయన యందు నిలిచియుండువాడెవడును  పాపము చేయడు; పాపము చేయువాడెవడును ఆయనను చూడనులేదు ఎరుగనులేదు.
7. చిన్నపిల్లలారా, యెవనిని మిమ్మును మోసపరచనీయకుడి. ఆయన నీతిమంతుడైయున్నట్టు నీతిని జరిగించు ప్రతివాడును నీతిమంతుడు.
8. అపవాది మొదట నుండి పాపము చేయుచున్నాడు గనుక  పాపము చేయువాడు అపవాది  సంబంధి; అపవాది  యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను.
9. దేవుని మూలముగా పుట్టిన ప్రతివానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయడు; వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము  చేయజాలడు.
10. దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది  పిల్లలెవరో తేటపడును. నీతిని జరిగించని ప్రతివాడును, తన సహోదరుని ప్రెమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కారు .
11. మనమొకని నొకడు ప్రేమింపవలెననునది మొదటనుండి  మీరు వినిన వర్తమానమేగదా.
12. మనము కయీను వంటివారమై యుండరాదు. వాడు దుష్టుని సంబందధియై తన సహోదరుని చంపెను ; వాడతనిని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు నీతి గలవియునై యుండెను గనుకనే గదా?
13. సహోదరులారా, లోకము మిమ్మును ద్వేషించిన యెడల ఆశ్చర్యపడకుడి.
14. మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటియున్నామని యెరుగుదుము. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచియున్నాడు.
15. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు; ఏ  నరహంతకునియందును నిత్యజీవముండదనిమీరెరుగుదురు.
16. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీనివలన ప్రేమ యెట్టిదని తెలిసికొనుచున్నాము. మనముకూడ సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్ట బద్ధులమై యున్నాము. 
17. ఈ లోకపు జీవనోపాధిగలవాడైయుండి తన సహోదరునికి లేమి కలుగుట చూచియు, అతని యెడల ఎంతమాత్రమును కనికరము చూపనివానియందు దేవుని ప్రేమ యేలాగు నిలుచును?
18. చిన్నపిల్లలారా, మాటతోను నాలుకతోను కాక క్రియతోను సత్యముతోనుప్రేమింతము. 
19. ఇందువలన మనము సత్యసంబంధులమని యెరుగుదుము. 
20. దేవుడు మన హృదయము కంటే అధికుడై, సమస్తమును ఎరిగియున్నాడు గనుక మన హృదయము ఏ యే విషయములలో  మనయందు దోషారోపణ చేయునో ఆ యా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరచుకొందము. 
21. ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయని యెడల దేవుని ఎదుట ధైర్యము గలవారమగుదుము. 
22. మరియు మనమాయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక, మనమేమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. 
23. ఆయన ఆజ్ఞ యేదనగా-ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని, ఆయన మనకు ఆగ్ననిచ్చిన ప్రకారముగా ఒకనినొకడు ప్రేమింపవలెననునదియే. 
24. ఆయన ఆజ్ఞలను గైకొనువాడు ఆయన యందు నిలిచియుండును, ఆయన వాని యందు నిలిచియుండును; ఆయన మనయందు నిలిచియున్నాడని ఆయన మనకనుగ్రహించిన ఆత్మమూలముగా తెలిసికొనుచున్నాము. 
     Download Audio File

No comments:

Post a Comment