Not seeing a Scroll to Top Button? Go to our FAQ page for more info.

Tuesday, April 23, 2013

1 యోహాను 5వ అధ్యాయము

1. యేసే క్రీస్తయి యున్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలముగా పుట్టియున్నాడు . పుట్టించినవానిని ప్రేమించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టినవానిని ప్రెమించును. 
2. మనము దేవుని  ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చువారమైతిమా దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దానివలననే యెరుగుదుము. 
3. మనమాయన ఆజ్ఞలను గైకొనుటయే  దేవుని ప్రేమించుట ; ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు . 
4. దేవుని మూలముగా పుట్టినవారందరును లోకమును జయించుదురు ; లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. 
5. యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు?
6. నీళ్ళ ద్వారాను రక్తము ద్వారాను వచ్చినవాడు ఈయనే, అనగా యేసుక్రీస్తే. ఈయన నీళ్ళతో మాత్రమేగాక  నీళ్ళతోను రక్తముతోను వచ్చెను. ఆత్మ సత్యము గనుక సాక్ష్యమిచ్చువాడు ఆత్మయే. 
7.  సాక్ష్యమిచ్చువారు ముగ్గురు, అనగా ఆత్మయు,నీళ్ళును, రక్తమును,
8. ఈ ముగ్గురు ఎకీభవించి యున్నారు. 
9. మనము మనుష్యుల సాక్ష్యము అంగీకరించుచున్నాము గదా! దేవుని  సాక్ష్యము మరి బలమైనది. దేవుని  సాక్ష్యము ఆయన తన కుమారుని గూర్చి యిచ్చినదే. 
10. దేవుని కుమారుని యందు విశ్వాసముంచువాడు  తనలోనే ఈ సాక్ష్యము కలిగియున్నాడు; దేవుని నమ్మనివాడు ఆయన తన కుమారుని గూర్చి యిచ్చిన సాక్ష్యమును నమ్మలేదు గనుక అతడు దేవుని అబద్ధికునిగా చెసినవాడే.  
11. ఆ సాక్ష్యమేమనగా --దేవుడు మనకు  నిత్యజీవమును దయచేసెను; ఈ జీవము ఆయన కుమారుని యందున్నది . 
12. దేవుని కుమారుని అంగీకరించువాడు జీవముగలవాడు; దేవుని కుమారుని అంగీకరింపనివాడు జీవములేనివాడే. 
13. దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్యజీవముగలవారని తెలిసికొనునట్లు నేను ఈ సంగతులను మీకు వ్రాయుచున్నాను. 
14. ఆయననుబట్టి మనకు కలిగిన ధైర్యమేదనగా ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను  ఆయన మన మనవి ఆలకించుననునదియే. 
15. మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనమెరిగిన యెడల మనమాయనాను వేడుకొనినవి మనకు కలిగినవని యెరుగుదుము. 
16. తన సహోదరుడు మరణకరము కాని పాపము చేయగా ఎవడైనను చూచినయెడల అతడు వేడుకొనును; అతనిబట్టి  దేవుడు మరణకరముకాని పాపము చేసిన వారికి జీవము దయచేయును. మరణకరమైన పాపము కలదు. అట్టిదానిగూర్చి వేడుకొనవలెనని నేను చెప్పుట లేదు. 
17.  సకల దుర్ణీతియు పాపము; అయితే మరణకరముకాని పాపము కలదు. 
18.  దేవుని మూలముగా పుట్టియున్న వాడెవడును పాపము చేయడని యెరుగుదుము. దేవుని మూలముగా పుట్టిన వాడు తన్ను భద్రము చేసికొనును గనుక దుష్టుడు వాని ముట్టడు. 
19.  మనము దేవుని సంబంధులమనియు, లోకమంతయు దుష్టుని యందున్నదనియు ఎరుగుదుము. 
20.  మనము సత్యవంతుడైన వానిని ఎరుగవలెనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకమనుగ్రహించియున్నాడని యెరుగుదుము. మనము దేవుని కుమారుడైన క్రీస్తుయేసునందున్నవారమై  సత్యవంతుని యందున్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్యజీవమునై యున్నాడు. 
21.  చిన్న పిల్లలారా, విగ్రహముల జోలికి పోకుండ జాగ్రత్తగా వుండుడి. 
Download Audio File

No comments:

Post a Comment